Advertisement


Home > Movies - Movie Gossip
‘ఆచారి’ నిరవధిక వాయిదా?

ఆచారి అమెరికా యాత్ర ఈ మధ్య కాస్త హోప్ వున్న సినిమాల్లో ఒకటి. నాగేశ్వర రెడ్డి డైరక్షన్ లో, విష్ణు-బ్రహ్మానందం కలిసి మళ్లీ మాంచి కామెడీ హల్ చల్ చేసిన సినిమాగా కాస్త బజ్ వచ్చింది. ఈ నెల 26న విడుదల అని డిసైడ్ అయింది. ఆ మేరకు ప్రచారం కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు వాయిదా పడినట్లు వార్తలు అందుతున్నాయి.

దీనికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి సెన్సారు సమస్య. ఈ రోజు సెన్సారు కావాల్సి వుంది. అవుతుందో లేదో తెలియదు. ఇటీవల సెన్సారుశాఖలో బదిలీలు జరిగిన దగ్గర నుంచి సెన్సారు అన్నది గ్యారంటీ లేకుండా అయిపోయింది. మరోపక్క ఆచారి అమెరికా యాత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కాస్త బకాయి వున్నట్లు తెలుస్తోంది.

వీటన్నింటికి తోడు నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరికి పాత సినిమాల తలకాయనొప్పులు కొన్ని వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి రీత్యా ప్రస్తుతానికి అయితే సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఎప్పుడు విడుదల అన్నది తెలియదు. బహుశా ఫిబ్రవరి రెండో వారం తరువాతే కావచ్చు. ఎందుకంటే 2న రెండు సినిమాలు వున్నాయి. 9న నాలుగు సినిమాలువున్నాయి. వాటిలో హీరో విష్ణు ఫాదర్ మొహన్ బాబు సినిమా వుంది. అందువల్ల 16లేదా ఆ తరువాతే ఆచారి విడుదల వుంటుందేమో?