ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్?

బోయపాటి-బాలకృష్ణ అనగానే సింహా, లెజెండ్ సినిమాలు కళ్ల ముందుకు వస్తాయి. బాలకృష్ణకు తిరుగులేని హిట్ సినిమాలు అవి. దర్శకుడు బోయపాటి ఆ తరువాత మళ్లీ బాలయ్యతో సినిమా చేయడం కుదరలేదు. వాస్తవానికి వందో సినిమా…

బోయపాటి-బాలకృష్ణ అనగానే సింహా, లెజెండ్ సినిమాలు కళ్ల ముందుకు వస్తాయి. బాలకృష్ణకు తిరుగులేని హిట్ సినిమాలు అవి. దర్శకుడు బోయపాటి ఆ తరువాత మళ్లీ బాలయ్యతో సినిమా చేయడం కుదరలేదు. వాస్తవానికి వందో సినిమా బోయపాటే చేయాలి కానీ, ఆయన కమిట్ అయిపోయిన అగ్రిమెంట్ల వల్ల, అలాగే క్రిష్ సరైన స్క్రిప్ట్ తేవడం వల్ల కుదరలేదు. ఆ తరువాత కూడా బాలకృష్ణ, బోయపాటి వేరువేరుగా బిజీ అయిపోయారు.

అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి ఒకరిద్దరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి చేస్తున్న జయ జానకీ నాయక సినిమా ఫినిష్ అయిపోయింది. విడుదలకు రెడీగా వుంది. బాలయ్య చేస్తున్న పైసా వసూల్ ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. దాని తరువాత కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా మాగ్జిమమ్ మూడు, నాలుగు నెలల్లో ఫినిష్ అవుతుందని తెలుస్తోంది.

అందుకే ఆ లోగా బోయపాటి కనుక స్క్రిప్ట్ రెడీ చేస్తే బాలయ్యతో సినిమా చేయించాలని అనుకుంటున్నారు. ఈ విషయమై ఈ వారంలో ఓ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బాలకృష్ణ ఓకె అనడంతో మిగిలిన వివరాలు అన్నీ బయటకు వస్తాయి.