ఘోస్ట్ నిర్మాతగా మారుతి?

డబ్బున్న వాళ్లు తమ వారసులను హీరోలను చేయాలంటే నేరుగా సినిమాలు నిర్మించరు. ఎవరినో పట్టుకుని, వాళ్ల చేత సినిమాలు చేయిస్తారు. విజయవాడ కేంద్రంగా పాపులర్ అయిన స్వీట్ ఇండియా కూడా ఇలాగే చేస్తోందట. తమ…

డబ్బున్న వాళ్లు తమ వారసులను హీరోలను చేయాలంటే నేరుగా సినిమాలు నిర్మించరు. ఎవరినో పట్టుకుని, వాళ్ల చేత సినిమాలు చేయిస్తారు. విజయవాడ కేంద్రంగా పాపులర్ అయిన స్వీట్ ఇండియా కూడా ఇలాగే చేస్తోందట. తమ కుర్రాడిని హీరోగా పెట్టి, డైరక్టర్ మారుతి నిర్మాతగా సినిమా నిర్మింపచేస్తోంది.

పైగా డైరక్టర్ మారుతికి ఒక్క పని చేయడం అంటే అంత కిట్టదు. ఒకేసారి పది పనులు చేయాలనుకుంటారు. అందుకే ఓ పక్క తన డైరక్షన్ లో సినిమాలు, మరోపక్క చిన్న సినిమాల ప్రొడక్షన్ ఇలా రకరకాలు తలకెత్తుకుంటారు. లేటెస్ట్ గా లండన్ బాబులు అనే చిన్న సిన్మా అందిస్తున్నారు.

పేరుకు మారుతి నిర్మాత అంట కానీ, అసలు నిర్మాత తెర వెనుక ఆ సినిమాతో పరిచయం అవుతున్న హీరో తాలూకు జనాలే అని వినికిడి. విజయవాడ కేంద్రంగా పాపులర్ అయిన స్వీట్ ఇండియా గ్రూప్ వారసుడే ఈ సినిమా హీరో అంట. త్రిపుర తరువాత తెలుగులో అవకాశాలు కరువైన స్వాతి ఇందులో హీరోయిన్. పలు విఫల ప్రయత్నాలు చేసిన చిన్నికృష్ణ అనే డైరక్టర్ ఈ సినిమాకు దర్శకుడు.

ఓ తమిళ చిన్న సినిమా చౌకగా కొని, దానికి మారుతి స్టయిల్ మార్పులు చేర్పులు చేసి, చిన్న కృష్ణతో తెరకెక్కించేసారు. జూలై, ఆగస్టుల్లో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ వదిలే ఆలోచనలో వున్నారు. సాధారణంగా బడ్జెట్ లో సినిమా చేయాలంటే మారుతి తరువాతే. ఈ హీరోయిన్, డైరక్టర్, కొత్త హీరో అంటే మినిమమ్ లో మినిమమ్ తో లాగించేసి వుంటారు అనుకోవాలి.