హీరో నుంచి క్యారెక్టర్ ఏక్టర్ గా మారి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత జగపతి బాబు మళ్లీ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం పటేల్ సర్. ఈ సినిమా షూట్ ప్రారంభం కావడానికి ముందే టీజర్ విడుదల చేసారు.
వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమా స్టార్ట్ చేసి చకచకా ఫినిష్ చేసేసారు. ఈ సినిమా విషయంలో ఆద్యంతం ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు జగపతి బాబు. దాని వెనుక కాస్త విషయం వుందని తెలుస్తోంది.
ఈ సబ్జెక్ట్ ముందుగా జగపతి బాబు దగ్గరకే వచ్చిందట. బాగా నచ్చేసి తాను, తన ఫ్రెండ్స్ కలిసి ఫ్రొడ్యూస్ చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచించారట. అయినా కొత్త దర్శకుడు అని కాస్త ఆలోచించి, ఓ లక్షన్నర ఖర్చు చేసి టీజర్ తీసి చూపించమన్నారట. అది బాగా తీయడంతో డైకర్టర్ గా అవకాశం ఇచ్చేసారట.
అయితే తాను, తన నేస్తాలు ప్రొడ్యూస్ చేస్తే బ్యానర్ వాల్యూ తోడవదని, సాయి కొర్రపాటిని సంప్రదించి, ఆయన బ్యానర్ లోకి మార్చినట్లు తెలుస్తోంది. సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకోకపోవడతతో పాటు, కొంత ఇన్వెస్ట్ మెంట్ కూడా చేసారు జగపతి అని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో జగపతి బాబు రోల్ ఒక్కటి మాత్రమే రివీల్ అయింది ఇప్పటికి. యంగ్ గా వున్న లుక్ జస్ట్ అలా తళుక్కన మెరిసింది ట్రయిలర్ లో. నిజానికి సినిమాలో జగపతి బాబు తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ రోల్ నే కీలకం అని, యంగ్ రోల్ లో కూడా జగపతి బాబు కనిపిస్తారని తెలుస్తోంది.