సెంటిమెంట్ల బాటలో త్రివిక్రమ్?

సినిమా ఇండస్ట్రీలో వున్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా వుండవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇందకు అతీతులేమీ కారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు అన్ని రకాల సెంటిమెంట్లు…

సినిమా ఇండస్ట్రీలో వున్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా వుండవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇందకు అతీతులేమీ కారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు అన్ని రకాల సెంటిమెంట్లు జోడిస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలోని పాటల్లో ఒక్కసారి అయినా పవన్ గొంతు వినిపించింది. అందుకే ఈసారి కూడా మళ్లీ పాడేస్తున్నాడు.

అత్తారింటికి దారేదిలో అత్తను కొత్త కోణంలో చూపించి, సక్సెస్ అయ్యారు. ఈసారి సవతి తల్లిని అలాగే కొత్త కొణంలో చూపించి సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు. మామూలు కథను చాలా పెద్ద స్కేల్ లో చూపించడం అన్నది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అత్తారింటికి దారేది, అ..ఆ సినిమాల్లో త్రివిక్రమ్ వాడిన చిట్కాల్లో ఇదీవుంది. ఇప్పుడు అందుకే ఈ సినిమాను కూడా అదే విధంగా భారీ భవంతులు, భారీ సెట్టింగులతో రూపొందిస్తున్నారు.

అత్తారింటికి దారేదిలో తన నటనతో ఆకట్టుకున్న బొమన్ ఇరానీని నిడివి తక్కువ వున్నా, కీలకమైన ఓ పాత్రకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ని సెంటిమెంట్లు పాటిస్తున్నందున హిట్ సెంటిమెంట్ అయిన పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి హిట్ ఇస్తుందేమో?