చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ-ప్రొడక్షన్ ఓ కొలిక్కి వస్తోంది. ఈ మూవీని చిరు బర్త్ డే సందర్భంగా వచ్చేనెల 22న లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. కుదిరితే అంతకంటే ముందే, అంటే ఆగస్ట్ 15కే లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. ఉయ్యాలవాడ నిర్మాత రామ్ చరణ్ ఆలోచన ఇది.
స్వతంత్ర ఉద్యమ కాలం నాటి కథతో వస్తోంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇలాంటి సినిమాను ఆగస్ట్ 15న ప్రారంభిస్తే సినిమాకు మంచి హైప్ వస్తుందనేది చరణ్ ఫీలింగ్. ఇదే విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా చర్చించాడు. చరణ్ కు ఓ ఆలోచన వచ్చిందంటే అది అమలై తీరుతుంది. సురేందర్ రెడ్డి కూడా ఎస్ అనేశాడు.
కాకపోతే చిరంజీవి మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేరు. భార్యతో కలిసి విదేశీ పర్యనటలో ఉన్నారు. ఫారిన్ టూర్ నుంచి వచ్చిన వెంటనే ఈ విషయంపై చిరంజీవిని సంప్రదిస్తారు. చిరు కూడా ఓకే అనేస్తే ఆగస్ట్ 15 ఫిక్స్ అయిపోతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు డైలాగ్స్ రాసే పనిలో పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా లాంటి రచయితలు బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ రూపుదిద్దుకుంటోంది.