ఏడాది కిందటి మేటర్ ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. హాలీవుడ్ లో సినిమా చేస్తున్న టైమ్ లోనే దీపికా పదుకోన్ పై ఈ పుకారు వచ్చింది. స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ తో దీపికా డేటింగ్ చేసిందనే వార్త అప్పుడే వచ్చింది. అయితే అప్పట్లో ఈ విషయానికి విదేశీ మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎందుకంటే దీపిక ఎవరనే విషయం వాళ్లకు తెలీదు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ వార్తపై ఓ చిన్న క్లారిటీ వచ్చింది.
ఈసారి జకోవిచ్ మాజీ ప్రియురాలు నటాషా ఈ విషయాన్ని ప్రస్తావించింది. అవును… వాళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అందుకే నేను తప్పుకున్నానంటూ నటాషా ప్రకటించడంతో మేటర్ మళ్లీ మొదటికి వచ్చింది. 2016లో దీపిక, జకోవిచ్ కలిసి లాస్ ఏంజెలస్ లోని ఓ రెస్టారెంట్ లో ప్రత్యక్షమయ్యారు. ఆ ఫొటోస్ అప్పట్లో సంచలనమయ్యాయి.
ఇదే విషయంపై దీపికను ప్రశ్నిస్తే అది కేవలం డిన్నర్ మాత్రమేనని అప్పట్లో కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు జకోవిచ్ మాజీ ప్రియురాలు మాత్రం వాళ్లిద్దరి మధ్య చాలా వ్యవహారం నడిచిందని ఆరోపిస్తోంది. తామిద్దరం విడిపోవడానికి దీపికనే కారణం అంటోంది.
పెళ్లికి ముందు జకోవిచ్ చాలామందితో డేటింగ్ చేశాడు. నటాషాతో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఓ లాయర్, లేడీ లీ అనే డీజేతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత దీపికతో డేటింగ్ చేశాడనే వార్తలు రావడం జకోవిచ్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి.