స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ ను కూడా పెళ్లి చేసుకుంది. ఈ మధ్యే పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. లైఫ్ మొత్తం సెటిల్. అయినా కూడా కరీనాకు ఇంకా గ్లామర్ పిచ్చి తగ్గలేదు. మరోసారి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోదామని కలలుకంటోంది బెబో.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగొచ్చు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది. కావాలంటే కరీనాకు కూడా మంచి పాత్రలు వస్తాయి. కానీ ఈవిడ మాత్రం అవి కోరుకోవడం లేదు. మరోసారి క్రేజీ హీరోయిన్ గా వెలుగు వెలగాలని అనుకుంటోంది. అందుకే షారూక్, సల్మాన్ లాంటి స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ వేషాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది.
పెళ్లి తర్వాత ఆమెకు హీరోయిన్ వేషాలు తగ్గాయి. ఇక ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారా అనేది డౌట్. మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ తో కలిసి గ్లామర్ షో చేసింది. ఐష్ కంటే తక్కువ వయసున్న తనకు కచ్చితంగా ఆఫర్లొస్తాయనే నమ్మకంతో ఉంది కరీనా. ఒకప్పటి గ్లామర్ ను తిరిగి సంపాదించుకునే క్రమంలో బ్యూటీపార్లర్లు, జిమ్ ల చుట్టూ తిరుగుతోంది.