నానిపై పెరుగుతున్న భరోసా

హీరో నానికి నాచురల్ స్టార్ అని అభిమానుల్లో పేరు వుంటే వుండొచ్చు గాక. అది వేరే సంగతి. నిర్మాతలు, బయ్యర్లలో మాత్రం నాని అంటే మినిమమ్ గ్యారంటీ అన్న పేరు మాత్రం క్లియర్ గా…

హీరో నానికి నాచురల్ స్టార్ అని అభిమానుల్లో పేరు వుంటే వుండొచ్చు గాక. అది వేరే సంగతి. నిర్మాతలు, బయ్యర్లలో మాత్రం నాని అంటే మినిమమ్ గ్యారంటీ అన్న పేరు మాత్రం క్లియర్ గా వుంది. నాని సినిమా అంటే అలా అలా కనీసం 20 పర్సంట్ కమిషన్ల రేంజ్ కన్నా తీసుకెళ్లిపోతుంది అన్న ఓ నమ్మకం వుంది. వస్తున్న ప్రతి సినిమా ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది కానీ దెబ్బతీయడం లేదు. అదే నానికి రాను రాను మరింత ప్లస్ గా మారుతోంది. అనుకోడదు కానీ, నాని కాంటెంపరరీ హీరోలు ఎవరికీ ఈ ప్లస్ పాయింట్ లేదు. పైగా నాని సినిమాల్లో మరో ప్లస్ ఏమిటంటే 15 కోట్ల రేంజ్ లోనే మార్కెట్ చేయడం అన్నది. 'నిన్ను కోరి' సినిమాను వరల్డ్ వైడ్ గా లెక్క పెట్టుకుంటే 20 కోట్లకు కాస్త అటుగా మార్కెట్ చేసారు.

లేటెస్ట్ గా 'నిన్ను కోరి' సినిమా కూడా ఫస్ట్ వీకెండ్ మూడురోజుల్లో 60 నుంచి 80శాతం వరకు పెట్టుబడులను వెనక్కు రప్పించడం విశేషం. టోటల్ గా ఫస్ట్ వీక్ లో బయ్యర్లు అంతా సేఫ్ జోన్ కు చేరిపోతారని టాక్ వినిపిస్తోంది. సినిమా బి సెంటర్లలో కూడా స్ట్రాంగ్ గా వుండడం విశేషం. నైజాంలో తొలి మూడు రోజులకు నాలుగున్నర కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. టోటల్ రన్ లో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వరకు వసూళ్లు వుండోచ్చని అంచనా వేస్తున్నారు. మిగిలిన విశాఖ లాంటి పెద్ద ఏరియాలు 20 పర్సంట్ కమిషన్ ను కళ్ల చూస్తాయని, ఈస్ట్, వెస్ట్ లాంటి  ఏరియాలు మరో పదిశాతం అదనంగా లాభాలు సంపాదిస్తాయని అంటున్నారు.

మొత్తంమీద ఈ సేఫ్ జోన్ లోనే మార్కెట్ చేసినంత కాలం నాని మిస్టర్ డిపెండబుల్ అనిపంచుకుంటాడు. అలా కాకుండా మళ్లీ 25 కోట్ల రేంజ్ కు వెళ్లే మాత్రం కష్టంకావచ్చు.