పవన్ సినిమాకు రికార్డు శాటిలైట్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో ముస్తాబవుతున్న సినిమాకు శాటిలైట్ బిజినెస్ ఫినిష్ అయింది. రికార్డు ప్రైస్ లభించడం విశేషం. Advertisement సన్ నెట్ వర్క్ ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 19.5…

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో ముస్తాబవుతున్న సినిమాకు శాటిలైట్ బిజినెస్ ఫినిష్ అయింది. రికార్డు ప్రైస్ లభించడం విశేషం.

సన్ నెట్ వర్క్ ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 19.5 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళ, మళయాల శాటిలైట్ హక్కులు ఇంకా వుండనే వున్నాయి.

ఒక విధంగా ఇది క్రేజీ ఆపర్ అని చెప్పాలి. మురగదాస్ కాంబినేషన్ వుండడంతో అన్ని లాంగ్వేజ్ లు కలిపి మహేష్ సినిమాకు 25 నుంచి 30 కోట్ల మధ్య రేటు పలికింది. కానీ పవన్ సినిమాకు కేవలం తెలుగు వెర్షన్ కే 20 కోట్ల దగ్గర రేటు పలకడం విశేషం.

ప్రస్తుతం పెర్ ఫెక్ట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.