టాప్-5లో నిలవలేకపోయిన కమల్ ‘బిగ్ బాస్’

భారీ అంచనాల మధ్య టెలికాస్ట్ అయిన తమిళ బిగ్ బాస్ కార్యక్రమం, రేటింగ్స్ విషయంలో మాత్రం ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ రియాలిటీ షోతో టాప్ లీగ్ లోకి ఎంటరైపోదామనుకున్న స్టార్ విజయ్ టీవీ…

భారీ అంచనాల మధ్య టెలికాస్ట్ అయిన తమిళ బిగ్ బాస్ కార్యక్రమం, రేటింగ్స్ విషయంలో మాత్రం ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ రియాలిటీ షోతో టాప్ లీగ్ లోకి ఎంటరైపోదామనుకున్న స్టార్ విజయ్ టీవీ ఆశలు గల్లంతయ్యాయి. రేటింగ్స్ లో కనీసం టాప్-5లోకి కూడా ఎంటర్ అవ్వలేకపోయింది తమిళ బిగ్ బాస్.

కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోను బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా తీసుకున్నారు. కమల్ తో పాటు బిగ్ బాస్ రియాలిటీ షో విజయ్ టీవీని ఆదుకోలేకపోయింది. ఎప్పట్లానే మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది సదరు ఛానెల్. కమల్ చేసిన బిగ్ బాస్ షో కంటే.. తమిళ్ లో ప్రసారమైన 2 సీరియళ్లు, మరో 2సినిమాలు టాప్ లో నిలిచాయి. 

తమిళ బిగ్ బాస్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో త్వరలోనే తెలుగులో ప్రసారం కానున్న బిగ్ బాస్ పై ఒత్తిడి పెరిగింది. తెలుగులో ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. ఈనెల 16 నుంచి ప్రసారం కానున్న ఈ రియాలిటీ షో తెలుగులో ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి.

హిందీలో సల్మాన్ ఖాన్ తో షూట్ చేసిన లోనవాలాలో ఉన్న భారీ విల్లాలోనే తెలుగు బిగ్ బాస్ ను కూడా షూట్ చేయబోతున్నారు. 12 మంది సెలబ్రిటీస్ తో 70 రోజుల పాటు ఈ రియాలిటీ షో కొనసాగుతుంది.