ఆ కథనం వెనుక చార్మీ?

ఎన్టీఆర్ జై లవకుశ సినిమా కోసం పూరిజగన్నాధ్ కథను కాపీ కొట్టేసాడని వార్తలు గుప్పు మన్నాయి. అయితే దీని వెనుక వైనంపై పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. టెంపర్ టైమ్ లో ఓ క్యారెక్టరైజేషన్ ను…

ఎన్టీఆర్ జై లవకుశ సినిమా కోసం పూరిజగన్నాధ్ కథను కాపీ కొట్టేసాడని వార్తలు గుప్పు మన్నాయి. అయితే దీని వెనుక వైనంపై పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. టెంపర్ టైమ్ లో ఓ క్యారెక్టరైజేషన్ ను పూరి తయారుచేసుకున్నాడు.

దాన్ని బన్నీకి, ఎన్టీఆర్ కు ఇద్దరికీ వివరించాడు. హీరోకి కాస్త నత్తి వుంటుంది. అందుకని అతను ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. గుంభనంగా వుంటూ వుంటాడు తన సమస్య ఎవరికీ తెలియకూడదని. ఈ మేరకు మాత్రమే పూరి తయారుచేసుకున్నాడు.

కానీ దాన్ని బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరు వద్దనేసారట అప్పట్లో. ఆ తరువాత చాలా కథలు విన్నారు. పూరి కూడా దాన్ని పక్కన పెట్టేసాడు. అయితే ఇప్పుడు జైలవకుశలో అదే క్యారెక్టర్ ఛాయలు వున్నాయని తెలియడంలో ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. ఇది ఎలా? ఎవరు చేసారు? పూరి కావాలని లీక్ చేసాడా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, ఈ కథనం లీక్ కావడం వెనుక చార్మి వుందన్నంది. చార్మి నిర్వహిస్తున్న పూరి కనెక్ట్ సంస్థతో ఆ పత్రికకు టై అప్ వుందని, ఆ లైన్ లో చార్మి ఈ లీక్ ఇచ్చి, కథనం ప్రచురించేలా చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంప్ ను ఇక పూరి వదిలేసుకున్నట్లే అనుకోవాలి.