కంగారు పెడుతోన్న సమంత

అక్టోబర్‌లో పెళ్లికి రెడీ అవుతోన్న సమంతకి ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. అటు తమిళం, ఇటు తెలుగులో వరుసగా సినిమాలు సైన్‌ చేసిన సమంత మరి పెళ్లిలోగా ఎన్ని సినిమాలు పూర్తి చేస్తుందనేది తెలియదు. Advertisement…

అక్టోబర్‌లో పెళ్లికి రెడీ అవుతోన్న సమంతకి ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. అటు తమిళం, ఇటు తెలుగులో వరుసగా సినిమాలు సైన్‌ చేసిన సమంత మరి పెళ్లిలోగా ఎన్ని సినిమాలు పూర్తి చేస్తుందనేది తెలియదు.

అక్టోబర్‌లో రిలీజ్‌ అనుకున్న 'రంగస్థలం 1985' ఇప్పుడు సంక్రాంతికి వాయిదా పడింది. అంటే అక్టోబర్‌, నవరబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ పనులు జరుగుతుంటాయి.

పెళ్లి పేరు చెప్పి సమంత ఎంత కాలం లీవ్‌ తీసుకుంటుందనేది ఇంకా తెలీదు. పెళ్లి తర్వాత మూడు నెలలు విహార యాత్రకి వెళ్లాలని చైతన్య, సమంత ప్లాన్‌ చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఆమెతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు కంగారు పడుతున్నారు.

సమంత పెళ్లి వల్ల చాలా చిత్రాల షూటింగ్‌ షెడ్యూల్స్‌ అప్‌సెట్‌ అయ్యే అవకాశాలున్నట్టే సూచనలున్నాయి. సంక్రాంతికి తప్పకుండా వస్తుందని ఫాన్స్‌ ఎదురు చూస్తోన్న 'రంగస్థలం' చిత్రం డిలే అవుతుందనే భయం కూడా నెలకొంది.

అయితే సమంత ప్రొఫెషనల్‌ కనుక ఎవరికీ ఇబ్బంది కలిగించకుండానే తన మ్యారేజ్‌, హనీమూన్‌ ప్లాన్‌ చేసుకుంటుందని అనుకోవచ్చు.