ప్లాన్-బి అమలు చేస్తానంటున్న గంటా

ప్లాన్-ఎ బెడిసికొట్టింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో గంటా రవి వెండితెర ఎంట్రీ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. దీంతో మరో కొత్త ప్లాన్ సిద్ధంచేస్తోంది గంటా కోటరీ. Advertisement ఈసారి జయంత్ లాంటి ఔట్…

ప్లాన్-ఎ బెడిసికొట్టింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో గంటా రవి వెండితెర ఎంట్రీ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. దీంతో మరో కొత్త ప్లాన్ సిద్ధంచేస్తోంది గంటా కోటరీ.

ఈసారి జయంత్ లాంటి ఔట్ డేటెట్ డైరక్టర్ ను కాకుండా, మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడి చేతిలో గంటాను పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మేరకు బోయపాటి, వినాయక్ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు. 

కొత్త కుర్రాళ్లను హీరోలుగా తెరపై చూపించిన అనుభవం వీళ్లిద్దరికీ ఉంది. అక్కినేని వారసుడు అఖిల్ తో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్ ను వెండితెరకు పరిచయం చేశాడు వినాయక్. ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తే గంటా రవి మరింత రాటుదేలుతాడని భావిస్తున్నారు.

అటు బోయపాటి కూడా మాస్ మూవీస్ తీయడంలో దిట్ట అనే విషయం తెలిసిందే. మొన్నటివరకు స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేసిన ఈ దర్శకుడు, బెల్లంకొండ సినిమాతో కాస్త రూటు మార్చాడు. కాబట్టి గంటా రెండో మూవీ కోసం బోయపాటి పేరును కూడా పరిశీలించవచ్చు.

భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే ఈ దర్శకులిద్దరూ కొత్తవాళ్లతో సినిమాలు చేయడానికి రెడీ. కాకపోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది బోయపాటి మాత్రమే. సాయిధరమ్ తేజ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు వినాయక్.

అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని పక్కనపెడితే, గంటా రవిని మరోసారి మాస్ గానే చూపించేందుకు రంగం సిద్ధమౌతోంది. కొడుకును ఎలాగైనా మాస్ హీరోగా నిలబెట్టేందుకు తండ్రి కమ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి మరింత గట్టి ప్రయత్నమే మొదలుపెట్టారట.