సినిమా ప్రమోషన్ లో భాగంగా కలిసి తిరిగారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రచారం కోసం ఏదో కిందామీదా పడుతున్నారనుకోవచ్చు. కానీ రాబ్తా సినిమా రిలీజైంది. అట్టర్ ఫ్లాప్ కూడా అయింది.
అయినా వీళ్లిద్దరూ ఒకరి చేయి మరొకరు వదల్లేదు. చెట్టపట్టాలేసుకొని దేశమంతా రౌండ్స్ కొడుతూనే ఉన్నారు. అది కూడా సినిమా ప్రమోషన్ కోసం కాదు. సొంత ఎఫైర్ పనిమీద. వాళ్లిద్దరూ ఎవరనే విషయం ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ ఇప్పుడు మరింత డీప్ అయ్యారట. సాయంత్రం అయితే ముంబయి హ్యాంగ్ అవుట్స్ లో వీళ్లే కనిపిస్తున్నారట. పేజ్ త్రీ ఫొటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నా తమపని తాము చేసుకుపోతోందట ఈ జంట. ఇదేంటని అడిగితే ఫ్రెండ్ షిప్ లో ఇవన్నీ కామన్ కదా అంటోంది.
ప్రస్తుతం డ్రైవ్ అనే సినిమా చేస్తున్నాడు సుశాంత్. ఈ సినిమాతో కృతికి ఎలాంటి సంబంధం లేదు. అటు బరేలీ కి బర్ఫీ సినిమా చేస్తోంది కృతి సనన్. ఈ సినిమాతో సుశాంత్ కు సంబంధం లేదు.
అయినప్పటికీ ప్రతి రోజూ వీళ్లిద్దరూ కలుస్తున్నారంటే ఏమనుకోవాలి. జస్ట్ ఫ్రెండ్ షిప్ అనుకుంటే సరిపోదు. ఇంకేదో ఉంది. కొన్నాళ్లు ఆగితే ఆ విషయాన్ని వాళ్లే చెబుతారేమో చూడాలి. అన్నట్టు వీళ్లిద్దరూ ఇప్పుడు ముంబయిలో ఒకే జిమ్ లో జాయిన్ అయ్యారు.