మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్ఎల్ఎ) నా? లేదా శాసన సభ్యుడు (ఎమ్ఎల్ఎ) నా ఎవరు కావాలి అల్లుడిగా అని అడిగితే, శాసనసభ్యుడే అంటాడు ఆ తండ్రి. అతగాడికి అంత పిచ్చి. తన ఇంటి నుంచి ఒక్కరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటాడు. తన వల్ల కాలేదు. కొడుకు వల్ల కాలేదు. కనీసం కాబోయే అల్లుడయినా? అన్న ఆశ.
ఇలాంటి మావగారి కోర్కెను ఆయన కూతుర్ని ప్రేమించిన కళ్యాణ్ రామ్ ఏలా తీర్చాడు. జస్ట్ అయిదు రూపాయలతో ఎలా ఎమ్మల్యే అయ్యాడు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి ఆసక్తి కరమైన కథనంతో తయారవుతున్న ఎమ్ ఎల్ ఎ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. కళ్యాణ్ రామ్ చాలా డీసెంట్ గా, అందంగా కనిపించాడు.
శ్రీనువైట్ల దగ్గర పని చేసిన ఉపేంద్ర ఈ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీ చాన్నాళ్ల తరువాత బ్రహ్మానందానికి ఈ సినిమాలో సూపర్ ఫన్ క్యారెక్టర్ క్రియేట్ చేసారట.
తన గురువు శ్రీనువైట్ల మాదిరిగానే ఉపేంద్ర కూడా బ్రహ్మీకి మాంచి క్యారెక్టర్ తయారుచేసాడట. ఈ దెబ్బకి మళ్లీ బ్రహ్మీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో విడుదయ్యే అవకాశం వుంది.