కష్టాల్లో సల్మాన్ ఖాన్ సినిమా

కలెక్షన్లు వచ్చేవరకే ఎవరైనా హీరో. ఒక్కసారి డౌన్ ఫాల్ మొదలైతే స్టార్ డమ్ ఎందుకూ పనికిరాదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది నూటికి నూరు పాళ్లు నిజం. భారీ వసూళ్లు రాబట్టేవాడే మొనగాడు.…

కలెక్షన్లు వచ్చేవరకే ఎవరైనా హీరో. ఒక్కసారి డౌన్ ఫాల్ మొదలైతే స్టార్ డమ్ ఎందుకూ పనికిరాదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది నూటికి నూరు పాళ్లు నిజం. భారీ వసూళ్లు రాబట్టేవాడే మొనగాడు. కలెక్షన్లు తగ్గితే ఎంత పెద్ద స్టార్ ను అయినా పక్కన పెడతారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు కూడా అదే పరిస్థితి వచ్చింది.

ట్యూబ్ లైట్ సినిమా ఫ్లాప్ టాక్ తో నడుస్తున్న వేళ, ఆ ప్రభావం సల్మాన్ నటిస్తున్న నెక్ట్స్ మూవీపై పడింది. ప్రస్తుతం “టైగర్ జిందా హై” అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్. 

ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తయింది. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మళ్లీ కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలని పట్టుబడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

భారీ మొత్తానికి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేశారు చాలామంది. ట్యూబ్ లైట్ వసూళ్లను చూపుతూ కొత్త సినిమా కాంట్రాక్టుల్ని సవరించాలని కోరుతున్నారు. మరోవైపు సల్మాన్ సినిమాల శాటిలైట్ రైట్స్ ను గంపగుత్తగా భారీ మొత్తానికి దక్కించుకున్న స్టార్ టీవీది కూడా ఇదే పరిస్థితి. ఆ ఛానెల్ కూడా మరోసారి అగ్రిమెంట్ ను రివైజ్ చేసుకుందామని సల్మాన్ ను కోరుతోంది.

తాజా పరిస్థితులతో సల్మాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే ట్యూబ్ లైట్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని ప్రకటించిన సల్మాన్ ఖాన్.. “టైగర్ జిందా హై” సినిమాకు సంబంధించి తను పుచ్చుకున్న రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని నిర్మాత ఆదిత్య చోప్రాకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట. ఏక్ థా టైగర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.