జూ.ఎన్టీఆర్‌లో రాజకీయనేతను చూస్తున్న రాజమౌళి!

తనతో కలిసి పని చేసిన హీరోల విషయంలో తన ఒపీనియన్స్ ను చెబుతూ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారు సినీ రంగంలో కాకుండా.. వారికి మరో రంగం ఏదయితే…

తనతో కలిసి పని చేసిన హీరోల విషయంలో తన ఒపీనియన్స్ ను చెబుతూ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారు సినీ రంగంలో కాకుండా.. వారికి మరో రంగం ఏదయితే బాగాసెట్ అవుతుంది? అనే ప్రశ్నకు రాజమౌళి చిత్రమైన సమాధానం చెప్పాడు.

ఇందులో భాగంగా తారక్ లో ఒక రాజకీయ నేతను చూస్తున్నట్టుగా రాజమౌళి చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురు హీరోలతోనూ రాజమౌళి సినిమాలు తీశాడు కదా.. మరి వీరు వేరే ప్రొఫెషన్లను స్వీకరిస్తే, ఎవరికి ఏది బాగుంటుందని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ప్రభాస్ చెఫ్ గా రాణిస్తాడని చెప్పాడు.

అదే రామ్ చరణ్ కు బిజినెస్ మ్యాన్ క్వాలిటీస్ ఉన్నాయన్నాడు. ఇక ఎన్టీఆర్ మాత్రం పొలిటీషియన్.. అనేశాడు రాజమౌళి. మరి కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఇలా మాట్లాడాడో లేక వారిలో వ్యక్తిగతం ఓర్పునేర్పులను చూసి ఈ మాట చెప్పాడో తెలీదు కానీ.. ఎన్టీఆర్ రాజకీయాలకు పనికొస్తాడని రాజమౌళి చెప్పడం ఆసక్తికరంగా ఉంది. 

ఎన్టీఆర్ రాజకీయాలకు పనికొస్తాడు సరే.. అవకాశం ఇచ్చేది ఎవరు? అవతల టీడీపీ వారసత్వం విషయంలో లోకేష్ బాబు తో ఎన్టీఆర్ పోటీ పడే పరిస్థితి లేదు. లోకేష్ ను రాజకీయ మేధావిగా నిరూపించడంలో బాబు బిజీగా ఉన్నాడు.

పార్టీ పై వారసత్వ హక్కులనూ కట్టబెట్టేశాడు చంద్రన్న. ఏదో వెనుకటికి అవసరార్థం ఎన్టీఆర్ ను వాడుకుందామని చూశాడు చంద్రబాబు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోటల్లా టీడీపీ ఓటమి పాలైంది కదా!