అల్లు అర్జున్ అంటే కొద్ది రోజుల క్రితం వరకు పవన్‌కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ అభిమానులకి మాత్రమే పడేది కాదు. ఒకప్పుడు హీరో అంటే 'పవన్ బాబాయే' అంటూ గొంతెత్తి అరిచిన అల్లు అర్జున్, కొన్నేళ్లలోనే రాగం, తానం, పల్లవి మార్చేసాడు.
పవన్ అభిమానుల వంక చూపించి పవర్‌స్టార్ నామ స్మరణ మానేసాడు. పవన్ గురించి 'చెప్పను బ్రదర్' అంటూ వివాదానికి తెర లేపి దానికి కవరింగ్ ఇచ్చుకోవడానికి చాలా ట్రై చేసాడు.
సరైనోడు టైమ్‌లో పవన్ ఫ్యాన్స్ కి దూరమైన అల్లు అర్జున్ ఎక్కువ టైమ్ వృధా చేయకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా సైడ్ చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. 'దాసరి మరణం' కారణంగా చూపి 'దువ్వాడ జగన్నాథమ్' వేడుకకి చిరంజీవిని పిలవని అల్లు అర్జున్ ఈ సినిమా థాంక్స్ మీట్‌లో అసలు చిరంజీవి ప్రస్తావనే తీసుకు రాలేదు.
పైగా 'నాన్-బాహుబలి' రికార్డులు కొట్టేసానని క్లెయిమ్ చేస్తూ తద్వారా 'ఖైదీ నంబర్ 150' రికార్డులు కూడా దాటేస్తానని చెప్పుకున్నాడు.
చిరంజీవి కుటుంబం నుంచి నెక్స్‌ట్ నంబర్‌వన్ ఎప్పుడూ రామ్ చరణ్ అంటూ చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు 'చిరంజీవి తర్వాత నువ్వే అంటున్నారని' అంటే 'అది కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని' అంటున్నాడు.
ఎలా చూసినా తనని తాను టాప్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు నెమ్మదిగా చిరు ఫ్యామిలీ నీడలోంచి బయటకి రావాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడని ఫాన్స్ గుర్తించారు.
అలా చేసినంత వరకు ఓకే కానీ అసలు చిరంజీవి కుటుంబంలో మిగతా వారిని పక్కకి పడేసి తన మీడియా మేనేజ్‌మెంట్‌తో, కలక్షన్స్ మ్యానిప్యులేషన్‌తో ఫేక్ సూపర్‌స్టార్‌డమ్ సృష్టించుకుని, చిరు ఫ్యామిలీని చిన్నబుచ్చడం ఏమిటనేది చాలా మంది ఆరోపణ.
ఏదేమైనా అల్లు అర్జున్ అత్యుత్సాహం వల్ల ఇప్పుడు మెగా అభిమానుల్లో చాలా మంది నుంచి సపోర్ట్ కోల్పోయాడు. మరి దానిని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తాడా లేక 'మీరు లేకపోతే ఎంత?' అనుకుంటాడా అనేది చూడాలి.