కార్తీ – ఖాకీ

అన్న సూర్య ఎప్పుడో ఖాకీ అవతారం ఎత్తి సింగం వన్, టు, త్రీ అంటూ దడ దడ లాడించేసాడు. ఇప్పుడు తమ్ముడు కార్తీ వంతు వచ్చింది. ఏకంగా ఖాకీ అంటూ పోలీస్ క్యారెక్టర్ తో…

అన్న సూర్య ఎప్పుడో ఖాకీ అవతారం ఎత్తి సింగం వన్, టు, త్రీ అంటూ దడ దడ లాడించేసాడు. ఇప్పుడు తమ్ముడు కార్తీ వంతు వచ్చింది. ఏకంగా ఖాకీ అంటూ పోలీస్ క్యారెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

వాస్తవానికి ఓ రీమేక్ లో పోలీస్ క్యారెక్టర్ వేసాడు. మన విక్రమార్కుడు సినిమానే తమిళ్ లో చేసాడు. ఈసారి ఒరిజినల్ స్టోరీతో చేస్తున్నాడు. కార్తీ సరసన టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు వదిలారు.

ఖాకీ అన్న పేరుకు ది పవర్ ఆఫ్ పోలీస్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో మరీ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. జస్ట్ పోలీస్ యూనిఫారమ్ లో కార్తీ తప్ప. వదిలిన రెండు స్టిల్స్ లో రాజస్థాన్ మ్యాప్, గుర్రంపై సవారీ వంటివి జస్ట్ లైట్ గా చూపించారంటే, సినిమా అక్కడ జరుగుతుందని అనుకోవాలి. అది మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనిపిస్తోంది ప్రస్తుతానికి.