వచ్చేవారం మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. నాని నటించిన నినుకోరి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి నటించిన మామ్, పిల్లలను ఆకర్షించే స్పైడర్ మాన్ సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్నాయి.
సాధారణంగా సినిమాలు కొన్ని మాస్, కొన్ని క్లాస్ వుంటే, ఇవి ఇక్కడ ఓకె, అవి అక్కడ ఓకె అని అనుకుంటారు. చిత్రంగా ఈ మూడు సినిమాలు కూడా మల్టీ ఫ్లెక్స్ ల సినిమాలు అని అనుకుంటున్నారు జనాలు.
నానికి మాస్, క్లాస్ తేడా లేకుండా మంచి ఫాలోయింగ్ నే వుంది. కానీ నిను కోరి సినిమా ట్రయిలర్ ఇతరత్రా వ్యవహారాలు చూస్తుంటే మరీ కాస్త క్లాస్ లవ్ స్టోరీ లుక్ లో వుంది. నాని సినిమాలొ ఎంటర్ టైన్ మెంట్ వుంటే ఎ, బి, సి అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో కుమ్మేస్తుంది. కానీ టూ క్లాస్ అయితే మాత్రం ఎలా వుంటుందో చూడాలి.
అలాగే శ్రీదేవి నటించిన మామ్ సినిమా మన దగ్గర బి సి సెంటర్లకు ఎక్కుతుందా అన్నది అనుమానం. అది కూడా మల్టీ ఫ్లెక్స్ లకు, బిగ్ సిటీల ఆడియన్స్ కు పట్టే సినిమా మాదిరిగానే కనిపిస్తోంది.
ఇక స్పైడర్ మాన్ అంటే చెప్పనక్కరలేదు. మల్టీ ఫ్లెక్స్ ల్లో పిల్లలు బారులు తీరతారు. కానీ బి సి సెంటర్లలో సింగిల్ స్క్రీన్ లకు ఈ సినిమా అంతగా పనికి రాదు.
అందువల్ల 7న విడుదలయ్యే మూడు సినిమాలు కూడా అర్బన్, ఇంకా మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ ల్లో గట్టి పోటీనే పడతాయి.