పూరిజగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకు పైసా వసూల్ అనే పేరు పెట్టారు. కానీ ఇది ఆ సినిమా మేటర్ కాదు. ఆ మూవీ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా సంగతి.
త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మొన్నటివరకు రెడ్డిగారు అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తెరపైకి వచ్చింది.
బాలయ్య 102వ సినిమాకు జయసింహ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. గతంలో ఇదే టైటిల్ తో పెద్ద ఎన్టీఆర్ ఓ సినిమా చేశారు. ఆ సంగతి పక్కనపెడితే సింహా అనే పేరు కలిసొచ్చింది కాబట్టి జయసింహా అనే టైటిల్ వైపే బాలయ్య మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతానికి సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేశారు. విలన్ గా శ్రీకాంత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడ్ని ఇంకా ఎంపిక చేయలేదు.