సహనం కోల్పోతున్న మహేష్‌!

'స్పైడర్‌' చిత్రాన్ని ఇప్పటికే చాలా డిలే చేసిన మురుగదాస్‌ ఇంతవరకు షూటింగ్‌ పూర్తి చేయలేదు. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి వున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ అనుకున్న దానికంటే ఎక్కువ…

'స్పైడర్‌' చిత్రాన్ని ఇప్పటికే చాలా డిలే చేసిన మురుగదాస్‌ ఇంతవరకు షూటింగ్‌ పూర్తి చేయలేదు. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి వున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందట. దీంతో విడుదల తేదీపై క్లారిటీని నిర్మాతలు ఇవ్వలేకపోతున్నారు.

సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తున్నామని ఒక ప్రకటన అయితే ఇచ్చారు కానీ దీని హక్కులు తీసుకున్న బయ్యర్లకి మాత్రం అదే తేదీకి వస్తున్నామని ఖచ్చితంగా చెప్పలేదు. అసలే దసరా టైమ్‌కి ఎక్కువ సినిమాలు విడుదలవుతూ వుండడంతో థియేటర్లు బ్లాక్‌ చేసుకోవడానికి బయ్యర్లు తొందర పడుతున్నారు.

సినిమా రిలీజ్‌ చేసినా కానీ థియేటర్లు లేకపోతే కష్టం కనుక ఇప్పుడే డేట్‌పై క్లారిటీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇటు నిర్మాతల మీదే కాకుండా మహేష్‌పై కూడా ఈ ప్రెజర్‌ వుందట.

అయితే మురుగదాస్‌ మాత్రం ఇంతవరకు ఖచ్చితంగా డేట్‌ చెప్పట్లేదట. దీంతో మహేష్‌ సహనం కోల్పోతున్నాడని, ఈ డిలే వల్ల దర్శకుడితో కూడా అతనికి మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.