బన్నీ హీరోయిన్ భారీ రిస్క్

వెండితెరపై నిండుగా చూపించే అందం మాత్రమే కాదు, గుండె నిండా ధైర్యం కూడా ఉందంటోంది పూజా హెగ్డే. అందుకే ఎన్నాళ్ల నుంచో కలగా మిగిలిపోయిన ఓ కోరికను తీర్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆ కల…

వెండితెరపై నిండుగా చూపించే అందం మాత్రమే కాదు, గుండె నిండా ధైర్యం కూడా ఉందంటోంది పూజా హెగ్డే. అందుకే ఎన్నాళ్ల నుంచో కలగా మిగిలిపోయిన ఓ కోరికను తీర్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆ కల పేరు స్కై డైవింగ్.

ఎత్తుగా ఉండే ప్రదేశాలంటే చాలా భయం అట పూజా హెగ్డేకు. అలాంటిది వందల మీటర్ల ఎత్తు నుంచి గాల్లోకి అమాంతం దూకేసే స్కై డైవింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ తన భయాన్ని పక్కనపెట్టి కోరిక తీర్చుకోవాలని డిసైడ్ అయింది పూజా. ఈ రోజు లేదా రేపు తన కలను నెరవేర్చుకుంటానంటోంది.

సైమా అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు అబు దాబి వెళ్లింది పూజా. అక్కడే స్కై డైవింగ్ చేస్తానంటోంది. నిజానికి డీజే సినిమా కోసం ఇప్పటికే ఓసారి అక్కడికి వెళ్లింది. కాకపోతే ఆ టైమ్ లో స్కై డైవింగ్ చేయడానికి యూనిట్ లో ఎవరూ ఒప్పుకోలేదట. సో.. ఈసారి తప్పకుండా స్కై డైవింగ్ చేస్తానంటోంది బన్నీ బ్యూటీ.