ఊహించని విధంగా సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్ అవ్వడంతో, జై లవకుశ యూనిట్ కే కాదు.. నందమూరి అభిమానులకు కూడా చిన్నపాటి షాక్ తగిలింది. దీనిపై నిర్మాత కల్యాణ్ రామ్ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడు. ఇప్పుడీ ఎఫెక్ట్ స్పైడర్ సినిమాపై కూడా పడింది.
త్వరలోనే స్పైడర్ సినిమాకు సంబంధించి సెకెండ్ టీజర్ విడుదల చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై రెండో వారంలో టీజర్ విడుదలయ్యే అవకాశముంది. అయితే అంతకంటే ముందే టీజర్ బయటకొస్తుందేమో అని భయపడుతున్నారు యూనిట్ సభ్యులు.
స్పైడర్ మొదటి టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నేషన్ వైడ్ పాపులర్ అయింది ఆ టీజర్. అదే ఊపులో సెకెండ్ టీజర్ ను కూడా తీసుకొద్దామని చూస్తున్నారు.
ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది ఈ టీజర్. చాలా హైప్ క్రియేట్ అయిన ఇలాంటి సినిమాకు సంబంధించి ముందుగానే టీజర్ బయటకొస్తే అది తమ సినిమా క్రేజ్ ను తగ్గిస్తుందని భయపడుతున్నాడు మహేష్.
పైగా సెకెండ్ టీజర్ లో ఫస్ట్ టీజర్ లా కాకుండా, కంటెంట్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో.. స్పైడర్ టీంకు ఇది చాలా కీలకమైన టీజర్ అన్నమాట. సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని బయటపెట్టేది ఈ టీజరే అన్నమాట.
ఇలాంటి కీలకమైన టీజర్ లీక్ అయితే అది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. అందుకే కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చెన్నైలో ఈ టీజర్ ఎడిటింగ్ జరుగుతోంది. కీలకమైన వ్యక్తులు మినహా మిగతావాళ్లను ఎడిట్ రూమ్ లోకి అనుమతించడం లేదు.