మొన్నటికి మొన్న చైనా చుట్టివచ్చారు చిరంజీవి. భార్యతో సహా చైనా ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదు. కట్ చేస్తే 80ల నాటి తన సినీ స్నేహితులతో అక్కడ చిన్నపాటి గెట్ టుగెదర్ జరిగింది. రాధిక, సుహాసిని లాంటి తారలతో చిరంజీవి దిగిన ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు మరోసారి చిరంజీవి ఫారిన్ ట్రిప్ మొదలైంది. ఈసారి చిరు టార్గెట్ అమెరికా.
అవును.. ఈసారి కూడా భార్యను వెంటేసుకొని అమెరికా పయనమయ్యారు చిరంజీవి. టూర్ లో అల్లు అరవింద్ కూడా తన భార్యతో కలిసి పాల్గొంటున్నారు. ఇంత సడెన్ గా చిరంజీవి అమెరికా వెళ్లడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా జరిగింది.
సాధారణంగా ఎడతెగని షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న టైమ్ లో కూసింత రిలాక్స్ అవ్వడం కోసం విదేశాలకు వెళ్తుంటారు స్టార్స్. కానీ ఇక్కడ చిరంజీవి అంత బిజీగా గడిపిన రోజులైతే లేవు. ఎందుకంటే కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు. టీవీ షో కూడా అయిపోయింది. రాజకీయంగా కూడా హడావుడి లేదు. కానీ చిరంజీవి అమెరికా ఎందుకు వెళ్లారనేది అందర్లో డౌట్.
తాజా సమాచారం ప్రకారం.. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ముందు మరోసారి విదేశాల్లో గడిపి రావాలని చిరు ఫిక్స్ అయ్యారట. అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే చిరంజీవి అమెరికా వెళ్లారని కొందరంటున్నారు.
మరికొందరేమో.. కొత్త సినిమా మేకోవర్ కోసం చిరంజీవి అమెరికా వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకొందరు మాత్రం పూర్తిగా వ్యక్తిగత పనుల మీద కొన్ని ఆర్థిక లావాదేవీల్ని చక్కబెట్టడానికి చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి అమెరికా వెళ్లారని అంటున్నారు.