ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాను నవంబర్ లో లాంచ్ చేయాలని నిర్ణయించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 9న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమౌతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ.
ప్రస్తుతం జై లవకుశ పనిలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సెప్టెంబర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతానికి సెప్టెంబర్ 1 రిలీజ్ అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ పెడతాడు. అటు త్రివిక్రమ్ కూడా సెప్టెంబర్ నాటికి పవన్ కల్యాణ్ సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడు.
పవన్ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనప్పటికీ సెప్టెంబర్ నాటికి షూటింగ్ మాత్రం కంప్లీట్ అయిపోతుంది. సో.. సెప్టెంబర్ మూడో వారానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఇద్దరూ ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి ఫైనల్ గా స్టోరీ డిస్కషన్ లో కూర్చొని సినిమాను పట్టాలపైకి తీసుకొస్తారు.
ఓవైపు త్రివిక్రమ్ వరుసగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీస్తున్నాడు. కానీ తారక్ కోసం తన పంథా మార్చి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కథ సిద్ధం చేశాడని అంటున్నారు. త్వరలోనే స్టోరీలైన్ పై ఓ క్లారిటీ వస్తుంది.