రేటు రెట్టింపు.. పూజాకు కూడా కోటి

సెకెండ్ ఇన్నింగ్స్ పూజా హగ్డేకు అద్భుతంగా కలిసొచ్చింది. బన్నీతో చేసిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, అప్పుడే ఆమె స్టార్ అయిపోయింది. ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో…

సెకెండ్ ఇన్నింగ్స్ పూజా హగ్డేకు అద్భుతంగా కలిసొచ్చింది. బన్నీతో చేసిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, అప్పుడే ఆమె స్టార్ అయిపోయింది. ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తన నెక్ట్స్ తెలుగు సినిమా కోసం పారితోషికాన్ని డబుల్ చేసింది పూజా హెగ్డే.

ఎక్కువగా స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేయడానికి ఇష్టపడే బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ఈసారి పూజా హెగ్డేపై కన్నేశాడు. అతడి కొత్త సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకునేందుకు నిర్మాతలు ఏకంగా కోటి 15లక్షల రూపాయలు ఆఫర్ చేశారు.

నిజానికి పూజా హెగ్డే కోటిన్నర డిమాండ్ చేసింది. ట్యాక్స్ లు కూడా మీరే కట్టుకోవాలనే షరతు విధించింది. చర్చల అనంతరం రేటు కోటి 15 లక్షలకు ఫిక్స్ అయింది. డీజే సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం 55 లక్షల రూపాయలు. ఆ నెక్ట్స్ మూవీకి రెమ్యూనరేషన్ రెట్టింపు అయిందన్నమాట.

తెలుగులో ఒకే ఏడాది 2 సినిమాలు చేసింది పూజా హెగ్డే. వరుణ్ తేజ సరసన ముకుంద, నాగచైతన్యతో కలిసి ఒక లైలా కోసం సినిమాలు చేసింది. ఆ రెండూ ఆమెకు స్టార్ డమ్ తీసుకురాలేదు. రెండేళ్లు గ్యాప్ ఇచ్చి డీజేతో మరోసారి టాలీవుడ్ కు వచ్చింది. బన్నీ సినిమా కావడంతో ఈసారి క్రేజ్ ఆటోమేటిగ్గా వచ్చేసింది.