మహేష్ ను కోర్టుకు లాగుతున్న శ్రీమంతుడు

బిడ్డ పోయినా పురిటి కంపు పోలేదని సామెత. శ్రీమంతుడు హిట్ అయిపోయింది. ఎవరి లాభాలు వారు చూసుకున్నారు. అంతా బాగానే వుంది. కానీ ఆ సినిమా కథ కాపీ అన్న కేసు మాత్రం ఇంకా…

బిడ్డ పోయినా పురిటి కంపు పోలేదని సామెత. శ్రీమంతుడు హిట్ అయిపోయింది. ఎవరి లాభాలు వారు చూసుకున్నారు. అంతా బాగానే వుంది. కానీ ఆ సినిమా కథ కాపీ అన్న కేసు మాత్రం ఇంకా వెన్నాడుతూనే వుంది.

శ్రీమంతుడు కథ తనదే అంటూ చెబుతున్న శరత్ చంద్ర ఈ విషయంలో పట్టువిడవకుండా పోరాడుతున్నారు. ఆయన ఈ నవలను స్వాతి మంథ్లీలో అనుబంధ నవలగా వెలువరించారు. పైగా రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేసారు.

ఈ విషయంలో చాలా వాయిదాలు పడ్డాయి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించమని సూపర్ స్టార్ మహేష్ బాబు కోరుతూ వస్తున్నారు. కానీ తాజాగా జరిగిన వాయిదాలో, కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది.

అంతే కాదు. మైత్రీ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎర్నేని నవీన్ హాజరు కానందుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో వుండే నవీన్ ఇప్పుడు తప్పని సరిగా హాజరు కావాల్సి వుంటుంది. అలాగే మహేష్ బాబు కూడా.

మరి వీరి న్యాయవాదుల తరువాతి స్టెప్ ఏం తీసుకుంటారో తెలియాల్సివుంది.