ఆ సినిమాతో ఎన్టీఆర్ కు సంబంధం లేదు!

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమాపై ఎప్పట్నుంచో ఓ రూమర్ ఉంది. అదేంటంటే.. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ “వరలారు”కు ఫ్రీ-మేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.…

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమాపై ఎప్పట్నుంచో ఓ రూమర్ ఉంది. అదేంటంటే.. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ “వరలారు”కు ఫ్రీ-మేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. తాజాగా దీనిపై ఓ చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది. ఆ తమిళ సినిమాకు జై లవకుశకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. 

విషయం తెలుసుకున్న వరలారు నిర్మాతలు, జై లవకుశ టీంతో చర్చలు జరిపారట. వాళ్లను ప్రత్యేకంగా హైదరాబాద్ కు ఆహ్వానించి రచయిత, దర్శకుడితో సమావేశం ఏర్పాటుచేశారట. జై లవకుశ స్టోరీ మొత్తం వాళ్లకు వినిపించారట. వరలారు, జై లవకుశకు ఎలాంటి సంబంధం లేదని నిర్థారించుకున్న తర్వాత తమిళ నిర్మాతలు సంతృప్తిగా వెళ్లిపోయారట. 

వరలారులో అజిత్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడు. జై లవకుశలో కూడా ఎన్టీఆర్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. రూమర్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. అయితే అజిత్ చేసిన క్యారెక్టర్స్ కు ఎన్టీఆర్ గెటప్స్ కు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు నిర్మాతలు. 

మొన్నటికి మొన్న డీజే సినిమా ఎంత వివాదం సృష్టించిందో చూశాం. అదింకా ముదరకముందే యూనిట్ మేల్కొంది. స్వయంగా బ్రాహ్మణ సంఘాలతో మీటింగ్ పెట్టింది. కూర్చొని చర్చించుకొని సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పుడు జై లవకుశ టీం కూడా కాస్త ముందుగానే వివాదాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఇలా మీటింగ్ పెట్టి, మేటర్ క్లియర్ చేసింది.