సినిమా ఛాన్సులు తగ్గితే క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అవ్వొచ్చు. అది కూడా వర్కవుట్ కాకపోతే బుల్లితెరపై ప్రయత్నించవచ్చు. సీరియల్స్, రియాల్టీ షోలు ఇలా చాలా ఉన్నాయి. కానీ “హీరోయిన్” అనే ఇమేజ్ తలకెక్కితే మిగతావేవీ కనిపించవు. హీరోయిన్ గానే కొనసాగాలి లేదంటే కష్టం అని ఫీల్ అవుతుంటారు కొందరు. సరిగ్గా ఇక్కడే తెరచాటు వ్యవహారాలు, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉదంతాలు బయటపడుతుంటాయి. ఇప్పుడు మరో నటి కూడా అలాంటి అడ్డదారుల్లోకి దూరింది.
తెలుగులో ఆ హీరోయిన్ చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. చేసినవి 3 సినిమాలే. వాటితో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అటు తమిళనాట ఇన్నాళ్లూ ఉన్న క్రేజ్ ఇప్పుడు తగ్గిపోయింది. దీంతో తాజాగా ఈ భామ కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. అయితే అక్కడ కూడా అవకాశాలు అంతంత మాత్రమే. సో.. ఈజీ మనీ కోసం చేయకూడని పనులు చేస్తోంది ఈ చిన్నది.
ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్ లో ఈ భామ దుకాణం తెరిచిన విషయం హాట్ న్యూస్ గా మారింది. సినీ ప్రముఖుల నుంచి కొంతమంది బడా బాబుల వరకు చాలామందికి ఈ విషయం తెలుసు. ఇంకా చెప్పాలంటే తమిళ చిత్రసీమలో ఇదొక బహిరంగ రహస్యం. గుట్టు రట్టయ్యే వరకు ఇలాంటి వ్యవహారాలు దర్జాగా సాగిపోతూనే ఉంటాయి.