ఆర్జీవీ మళ్లీ టాలీవుడ్ కు?

ఒకసారి అలిగి, మరోసారి పరాజయాలు చవిచూసి, టాలీవుడ్ ను వదిలి వెళ్లాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందువల్ల ముచ్చటగా మూడోసారి మళ్లీ ఎంట్రీ ఇవ్వకూడదని రూలు ఏమీ లేదు. Advertisement ఇదే ఆలోచన…

ఒకసారి అలిగి, మరోసారి పరాజయాలు చవిచూసి, టాలీవుడ్ ను వదిలి వెళ్లాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందువల్ల ముచ్చటగా మూడోసారి మళ్లీ ఎంట్రీ ఇవ్వకూడదని రూలు ఏమీ లేదు.

ఇదే ఆలోచన రామ్ గోపాల్ వర్మ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఓసారి యంగ్ హీరో రాజ్ తరుణ్ తో సినిమా చేసే ప్రయత్నం జరిగింది. అది ఇప్పటికీ అలాగే వుంది.

ఇప్పుడు దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. మొన్నటికి మొన్న రాజ్ తరుణ అంధగాడును ముంబాయిలో క్యూబ్ లో ప్రత్యేకంగా వీక్షించడమే కాకుండా, అభినందన విడియో కూడా వదిలాడు ఆర్జీవీ. తగినంత కారణం లేకుండా ఆర్జీవీ ఏ పనీ చేయరని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో రాజ్ తరుణ్ కు ఓ అయిదు కోట్ల మార్కెట్ స్థిరంగా వుంది. మంచి సినిమా పడితే అది పది నుంచి ఎంతకయినా వెళ్తుంది. అందుకే రాజ్ తరుణ్ హీరోగా మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయాలని ఆర్జీవీ తలపోస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పుడెప్పుడో సుమంత్ తో ప్రేమకథ తీసాడు ఆర్జీవీ. ఆ తరువాత అన్నీ రక్తపాతాలు, ఎక్స్ పోజింగ్ లే. మరి ప్రేమకథ ఈ తరానికి నచ్చేలా తీస్తారా? అసలు మళ్లీ టాలీవుడ్ కు వస్తారా? అన్నవి ఇంకా నిర్థారణ కావాల్సి వుంది. ప్రస్తుతానికి మాత్రం గుసగుసలే.