బాలయ్యా? మజాకానా?

హీరో బాలకృష్ణకు కాస్త మొండితనం, మరికాస్త తెగింపు ఎక్కువే. వాటిని మరోసారి తన సినిమా షూట్ ప్రదర్శించారట. పూరిజగన్నాధ్ దర్శకత్వంలో విదేశాల్లో జరుగుతున్న షూటింగ్ లో భాగంగా ఓ సీన్ కోసం డూప్ లేకుండా…

హీరో బాలకృష్ణకు కాస్త మొండితనం, మరికాస్త తెగింపు ఎక్కువే. వాటిని మరోసారి తన సినిమా షూట్ ప్రదర్శించారట. పూరిజగన్నాధ్ దర్శకత్వంలో విదేశాల్లో జరుగుతున్న షూటింగ్ లో భాగంగా ఓ సీన్ కోసం డూప్ లేకుండా బాలయ్యే నటించేసారట.

కారును గిర్రున తిప్పే సీన్ అది. దీనికోసం కొన్ని సాంకేతిక సదుపాయాలు వినియోగించుకుంటారు. కారులో డూప్ లను వుంచి కారును కింద వున్న ప్లేట్ ఆధారంతో గిర్రున రంగులరాట్నం మాదిరిగా తిప్పుతారు.

ఈసీన్ ను బాలయ్య డూప్ లేకుండా చేస్తానని, చేసేసాడట. ఆయన బాగానే వున్నాడు. కానీ అదే టైమ్ లో కారులో వున్న హీరోయిన్ శ్రియ మాత్రం షాకే షాక్ అంట. 

దసరా విడుదల కోసం ముస్తాబవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఈ నెల 10న విడుదల చేస్తారు. ఆ రోజు బాలయ్య బర్త్ డే. ఈ సినిమాలో బాలయ్య ఓల్డ్ మాన్ గా, మాఫియా డాన్ గా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఆనంద్ ప్రసాద్.