ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు బండి యమా జోరుగా వుంది. శతమానం భవతి, నేను లోకల్ మాంచి డబ్బులు తెచ్చాయి. నమో వేంకటేశాయ మాత్రం కాస్త దెబ్బ తీసింది. అయితేనేం, ఇప్పుడు ఈ ఇయర్ సెకండాఫ్ అంతా దిల్ రాజు హవానే కనిపిస్తోంది. మహేష్ బాబు స్పయిడర్ సినిమాను నైజాం కు 25 కోట్లకు తీసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా 30 కోట్ల రేంజ్ లో బేరాలు సాగుతున్నాయి. ఆ బ్యానర్ సినిమాలు అన్నీ దిల్ రాజువే. అందువల్ల పెద్దగా చేయి మారకపోవచ్చు.
ఇక తన స్వంత సినిమా డిజె వుండనే వుంది. అది కూడా నైజాం ఆయనే వుంచుకుంటారు. ఎంత లేదన్నా 20 కోట్ల మేరకు వాల్యూ వుంటుంది. ఇక కళ్యాణ్ రామ్ నిర్మించే ఎన్టీఆర్ సినిమా అంటే అదీ దిల్ రాజుదే. మరి బేరం ఎంత అన్నది ఇప్పటికి ఇంకా బయటకు రాలేదు. అది కూడా 20 రేంజ్ కు పైనే వుంటుంది. అంటే అన్నీ కలిపి వంద కోట్ల మేరకు నైజాంలో బిజినెస్ లు అన్నమాట.
అసలు దిల్ రాజు కాస్త వెనకడుగు వేసారు కానీ, లేదూ అంటే బాహుబలి 2 కూడా ఆయన చేయాల్సివుంది. అది కూడా కలిపితే, 150 కోట్ల మేరకు నైజాంలో పంపిణీ అన్నమాట.