రాజ్ తరుణ్ కు వింత రోగం

హీరో రాజ్ తరుణ్ కు ఓ వింత రోగం ఉంది. అది అలాంటిలాంటి రోగం కాదు. ఎవరికైనా చెబితే నవ్వుతారు కూడా. ఆ రోగం పేరు క్లెప్తమేనియా. తనకు తెలియకుండానే, అవసరం ఉన్నా లేకపోయినా…

హీరో రాజ్ తరుణ్ కు ఓ వింత రోగం ఉంది. అది అలాంటిలాంటి రోగం కాదు. ఎవరికైనా చెబితే నవ్వుతారు కూడా. ఆ రోగం పేరు క్లెప్తమేనియా. తనకు తెలియకుండానే, అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనాలు చేసేయడమే ఈ రోగం ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, రాజ్ తరుణ్ ఓ కాఫీ షాప్ లో ఉన్నారనుకోండి. 

సరదాగా మీతో మాట్లాడుతూనే టేబుల్ పై ఉన్న ఏదో ఒక వస్తువును తీసి జేబులో వేసేసుకుంటాడన్నమాట. తను దొంగతనం చేశాననే విషయం ఆ క్షణంలో రాజ్ తరుణ్ కు తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే ఇది రాజ్ తరుణ్ రోగం.

తన అప్ కమింగ్ మూవీలో రాజ్ తరుణ్ చేస్తున్న పాత్ర స్వభావం ఇది. సినిమా పేరు రాజు గాడు. ట్యాగ్ లైన్ యమ డేంజర్. తనకు తెలియకుండానే చేతివాటం చూపించే ఓ హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథతో ఈ సినిమా రాబోతోంది. స్టోరీలైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో కుక్కల్ని కిడ్నాప్ చేసే కుర్రాడిగా కనిపించాడు రాజ్ తరుణ్. రిలీజ్ కు రెడీ అయిన అంధగాడు సినిమాలో కొంతసేపు అంధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఇలా తెలియకుండా దొంగతనాలు చేసే వ్యక్తిగా మారిపోయాడు. వరుసగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైనే సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ కొత్త సినిమా కూడా అదే బ్యానర్ పై వస్తోంది.