అంధగాడు దాసరికి అంకితం?

టాలీవుడ్ పెద్దాయిన దాసరి అస్తమించారు. ఆయన గురుతులే మిగిలాయి. ఆయన మరణించిన తరువాత విడుదలవుతున్నతొలి సినిమా అంథగాడు. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్ లో వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో ఎకె ఎంటర్ టైన్మెంట్స్…

టాలీవుడ్ పెద్దాయిన దాసరి అస్తమించారు. ఆయన గురుతులే మిగిలాయి. ఆయన మరణించిన తరువాత విడుదలవుతున్నతొలి సినిమా అంథగాడు. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్ లో వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో ఎకె ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాను 2న విడుదల చేస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1వ తేదీన పలు చోట్ల ప్రీమియర్లు ప్లాన్ చేసారు.

ఇప్పుడు ఈ సినిమాను దాసరి నారాయణరావుకు అంకింతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం వున్నందున, క్యూబ్ లోడింగ్ అంతా అయిపోయినందున, అంకితం కార్డ్ వేయడం అవుతుందా? అని ఆలోచిస్తున్నారు. సాంకేతికంగా వీలు అవుతుందా అని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లేదూ అంటే ముందుగా ప్రకటించేసి, ఆ తరువాత టైటిల్ కార్డ్ జోడిస్తారు. దీనికి ఒకటి రెండు రోజులు టైమ్ పట్టే అవకాశం వుంది.

ఇదిలా వుంటే అంధగాడు శాటిలైట్ బిజినెస్ ఫార్మాలిటీస్ నిన్నపూర్తయ్యాయి. జెమిని టీవీకి అన్నీ కలుపుకుని 3.15 కు ఇచ్చినట్లు తెలుస్తోంది.