సెప్టెంబర్ కే రెడీ కానీ విడుదల సంక్రాంతికి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తయారవుతున్న భారీ యాక్షన్ మూవీ విడుదలపై రకరకాల వార్తలు వినవస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 21 కి విడుదల చేద్దామని ముందే డిసైడ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తయారవుతున్న భారీ యాక్షన్ మూవీ విడుదలపై రకరకాల వార్తలు వినవస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 21 కి విడుదల చేద్దామని ముందే డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదల అన్న మాట వినిపిస్తోంది.

నిజానికి రెండు రోజులు గ్యాప్ మినహా పవన్ సినిమా షూట్ యాజ్ ఇట్ ఈజ్ గా సాగిపొతోందట. మధ్యలో రెండురోజులు మాత్రం పవన్ కు ఆరోగ్యం బాగా లేదని షూట్ కు రాలేదట. అందువల్ల సినిమా అనుకున్నప్రకారం సెప్టెంబర్ 21 విడుదలకు రెడీ అయిపోతుంది. ముంబాయి కంపెనీకి విఎఫ్ఎక్స్ పనులు అప్పచెప్పారు. ఆ కంపెనీ కూడా ఇన్ టైమ్ లోనే వర్క్ ఫినిష్ చేస్తామనే మాట ఇచ్చిందట. అయినా కూడా సంక్రాంతి విడుదల అన్నది ఎందుకు?

ఈ సెప్టెంబర్ ఫుల్ బిజీలా వుండే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జై లవకుశ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఒకవెళ కాస్త ఆలస్యమైతే సెకెండ్ వీక్. ఇక మహేష్-మురుగదాస్ సినిమా సెప్టెంబర్ 27 కు ఫిక్సయింది. ఈ రెండూ కాక పూరి-బాలయ్యల సినిమా అదే నెల 29కి రెడీ అవుతోంది. అంటే ఒకే నెలలో మూడు భారీ సినిమాలు. వీటితో పాటే విడుదల కావాలి పవన్ కళ్యాణ్ సినిమా కూడా.

ఇక్కడ మరో సమస్య ఏమిటంటే, అన్ని సినిమాలు కూడా 70 నుంచి 150 కోట్ల సినిమాలే. ఇంత అంటే నాలుగు సినిమాలు కలిసి దాదాపు 500 కోట్లు పూల్ చేయాలి బయ్యర్లు అంతా కలిసి. ఇది కాస్త సమస్య అవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ సినిమాను సంక్రాంతికి మారిస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన ప్రారంభమైంది.

ఇదిలా వుంటే మహేష్ స్పయిడర్ దసరాకు కాకుండా దీపావళికి వెళ్తుందనీ ఓ గ్యాసిప్ వుంది. ఎందుకంటే తమిళులకు దీపావళి అంటే పెద్ద సీజన్. మురుగదాస్ డైరక్టర్ కావడం, మహేష్ తొలిసారి తమిళంలోకి వెళ్తుండడంతో దీపావళి అయితే బెటర్ అన్న పాయింట్ ఒకటి వుందట. అదే జరిగితే మళ్లీ పవన్ సినిమాకు దసరా టైమ్ లో స్పేస్ వస్తుంది. అందుకే రెడీ చేయడం షెడ్యూలు ప్రకారం రెడీ చేస్తున్నారు.

సో, ఎన్టీఆర్-మహేష్ సినిమాలు టైమ్ ప్రకారం వస్తే పవన్ సినిమా సంక్రాంతికి, లేదూ వాటిల్లో ఏ సినిమా రాకున్నా, దసరాకు అదీ సంగతి.