దాసరి-రామోజీ-బదనిక

1983 మార్చి చతుర నవల – పేరు- బదనిక అది చదివితే దర్శకుడు దాసరి నారాయణరావు గుర్తుకురావడం ఖాయం. అది ఆయనను సినిమా జీవితాన్ని ఉద్దేశించి రాసినది అని ఇట్టే అర్థం అయిపోతుంది. Advertisement…

1983 మార్చి చతుర నవల – పేరు- బదనిక అది చదివితే దర్శకుడు దాసరి నారాయణరావు గుర్తుకురావడం ఖాయం. అది ఆయనను సినిమా జీవితాన్ని ఉద్దేశించి రాసినది అని ఇట్టే అర్థం అయిపోతుంది.

రాసిన రచయితే ఏ ఉద్దేశంతో రాసారో? చతుర లో ఎందుకు ప్రచురించారో తెలియదు కానీ, అప్పట్లో మీడియా మొఘల్ రామోజీకి దర్శకుడు దాసరికి  ఎందుకనో విరోధం ఏర్పడింది.

అక్కడి నుంచి అప్పట్లో లీడింగ్ సినిమా మాగ్ జైన్ అయిన సితారలో దాసరి సినిమా వార్తలు కనిపించేవి కావు. ఆయన సినిమాల కవరేజి వుండేది కాదు. స్టిల్స్ వుండేవి కాదు.

సినిమాలు విడుదలైనపుడు సమీక్షలు వేయాల్సి వచ్చేది. అప్పుడు మాత్రం దాసరి నారాయణ రావు పేరు వేయక తప్పేది కాదు. అప్పుడు కూడా దాసరి సినిమాలను శల్య పరీక్ష చేసేవారు. ఒకవిధంగా చెప్పాలంటే చీల్చి చెండాడేసే వారు.

1983 మార్చిలో నవల వస్తే, 1984 డిసెంబర్ లో ఉదయం దినపత్రిక ప్రారంభమైంది. దాంతో పాటే శివరంజని సినిమా పత్రిక కూడా. ఈ విషయంలో దాసరికి అండగా నిలిచింది, రామోజీతో విభేధించి ఈనాడు నుంచి బయటకు వచ్చిన ఎబికె ప్రసాద్.

ఆయన శిష్య బృందం. ఒక స్టేజ్ లో ఉదయం కొత్త తరహా జర్నిలిజానికి శ్రీకారం చుట్టింది. యువ పాత్రికేయ బృందం ఉదయాన్ని చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. కానీ దాసరి దానిని ఎంతో కాలం రన్ చేయలేక పోయారు.

మాగుంట ఫ్యామిలీకి ఉదయం అమ్మేసారు. మాగుంట ఫ్యామిలీకి వున్న మద్యం వ్యాపారం ఉదయం పత్రికకు ఆర్థిక అండగా వుండడంతో, ఈనాడు మద్య నిషేదాన్ని తలకెత్తుకుంది. ఆ తరువాత పరిణామాలు అందరికీ తెలిసినవే.

కానీ చిత్రంగా మళ్లీ దాసరి, రామోజీ ఒక్కటయ్యారు. దాసరికి ఈనాడు అత్యథిక ప్రాధాన్యత ప్రారంభమయింది. దాంతో గతం మరుగున పడిపోయింది.