సినిమా సెన్సారు బోర్డు సిత్రాలు భలేగా వుంటాయి. కొన్ని సినిమాల్లో లీటర్లకు లీటర్లు రక్తం కారినా ఏమీ అనరు. కొన్ని సినిమాల్లో చుక్క రక్తం కనిపిస్తే అమ్మో అంటారు. మర్డర్ రివెంజ్ స్టోరీ కేశవ సినిమాకు ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇస్తాం అన్నారట సెన్సారు వాళ్లు. అదెందుకు అంటే సినిమాలో రక్తం, హత్యలు వున్నాయి కదా అని అన్నారట. అలా కాదని, డిస్కషన్ కు దిగి, మూడు సీన్లు కాస్త కట్ చేస్తే, యుఎ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు.
మరి ఈ లెక్కన బాహుబలి 2 కి యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇచ్చినట్లో? సినిమా నిండా చంపేసుకోవడాలు అపారంగా వుంటాయి కదా? ఇక రక్తం అయితే చెప్పనక్కరే లేదు. సినిమా క్లయిమాక్స్ ఫైట్ లో విలన్ రానా, హీరో ప్రభాస్ ను భీకరంగా రక్తం కారేలా చేస్తాడు. మరి అలాంటపుడు ఎ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా?
మన సెన్సారు ఈ పని చేయలేకపోయినా, సింగపూర్ సెన్సారు ఇదే పని చేసింది. బాహుబలి 2 చాలా హింసాత్మకంగా వుందని ఎన్ సి 16 సర్టిఫికెట్ ఇచ్చిందట. అంటే 16 ఏళ్ల లోపు వాళ్లు చూడకూడదని. మన సెన్సారు వాళ్లు ఇలా. వాళ్లు అలా.