మేడ్చల్ లో డీజె ఫైట్

మొత్తానికి క్లయిమాక్స్, రెండు పాటలు మినహా మిగిలిన సినిమా ఫినిష్ చేసుకున్నాడు డిజె అలియాస్ దువ్వాడ జగన్నాధమ్. క్లయిమాక్స్ కోసం మేడ్చల్ ను సరైన ప్లేస్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ సెట్…

మొత్తానికి క్లయిమాక్స్, రెండు పాటలు మినహా మిగిలిన సినిమా ఫినిష్ చేసుకున్నాడు డిజె అలియాస్ దువ్వాడ జగన్నాధమ్. క్లయిమాక్స్ కోసం మేడ్చల్ ను సరైన ప్లేస్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ సెట్ ను అన్నపూర్ణలో ప్రీ డిజైన్ చేసి, మేడ్చల్ లో అసెంబుల్ చేసే పనిలో వున్నారు. అక్కడ ఫైట్ ఫినిష్ చేస్తే, సినిమా టాకీ పూర్తయినట్లే. ఇక రెండు పాటల చిత్రీకరణ బకాయి వుంటుంది. ఒకటి ఓవర్ సీస్ లో, రెండవది లోకల్ గా సెట్ లో తీయడానికి డిసైడ్ అయ్యారు.

కానీ ఈలోగా సినిమాకు రెండో సారి సినిమాటోగ్రాఫర్ మారిపోయారు. అయ్యంకన్ బోస్ కు డైరక్టర్ హరీష్ శంకర్ కు పడక, నెల రోజుల క్రితమే జండా ఎత్తేసారు. ఆయన స్ఢానంలో వచ్చిన సునీల్ పటేల్ కూడా ఈ నెల 21తో వెళ్లిపోతున్నారు. మళ్లీ అయ్యంకన్ బోస్ నే తీసుకురండి, ఎలాగూ ఫుల్ పేమెంట్ ఇచ్చేసాం కదా అంటున్నారు నిర్మాత దిల్ రాజు అని వినికిడి. మరి దీన్ని దర్శకుడు హరీష్ ఎలా రిసీవ్ చేసుకుంటారో?

ఇదిలా వుంటే నిర్మాత దిల్ రాజు సరిగ్గా పేమెంట్ ఇవ్వడం లేదని, బన్నీ కోరి తెచ్చుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండు పాటలు వుండగా మరి, ఆ కాస్ట్యూమ్ డిజైనర్ వెళ్లి పోతే వేరేవాళ్లు డిజైన్ చేయాల్సి వుంటుంది. మరోపక్క సినిమా అనుకున్న దాని కంటే లేట్ కావడంతో, ముందుగా వేరే ప్రాజెక్టులు ఒప్పుకున్న టెక్నీషియన్లు ఒక్కొక్కరుగా తప్పుకోక తప్పడం లేదు.