తెలుగులోకి ‘క(గ)ణితన్’

2016లో తమిళ నాట వచ్చిన మంచి మూవీస్ లో క(గ)ణితన్ ఒకటి. మీడియం రేంజ్ సినిమాగా వచ్చి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే అందుకుంది. ఈ సినిమాను అందించింది సంతోష్. ఇతగాడు మురుగదాస్ దగ్గర…

2016లో తమిళ నాట వచ్చిన మంచి మూవీస్ లో క(గ)ణితన్ ఒకటి. మీడియం రేంజ్ సినిమాగా వచ్చి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే అందుకుంది. ఈ సినిమాను అందించింది సంతోష్. ఇతగాడు మురుగదాస్ దగ్గర సహాయకుడిగా పనిచేసాడు. ఈ సినిమాలో బిబిసి జర్నలిస్ట్ కావాలనుకున్న ఓ యువకుడు, అనుకోని కుట్రలో ఇరుక్కోవడం, దాన్ని ఛేదించి ఎలా బయటపడ్డాడు అన్నది పాయింట్.

ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి రాబోతోంది. తమిళంలో విడుదల తరువాత వచ్చిన సూచనలకు అనుగుణంగా చిన్నచిన్నమార్పులు చేస్తూ, తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. తమిళ డైరక్టర్, నిర్మాతలే ఈ ప్రాజెక్టును తెలుగులోకి తీసుకువస్తున్నారు. హీరోగా నిఖిల్ ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం కేశవ సినిమా విడుదల కాబోతోంది. దాని తరువాత నిఖిల్, కిర్రాక్ పార్టీ తెలుగు వెర్షన్ సినిమా చేయబోతున్నారు. దాని తరువాత గణితన్ రీమేక్ వుంటుంది. 

అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు రీమేక్ లు అన్నమాట.