సూపర్ హిట్ అవుతాయనుకునే సినిమాలు ఫ్లాప్ లు అవ్వడం, కష్టమేమో అనుకున్న సినిమాలు ఆశ్చర్యకరంగా హిట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. శర్వానంద్ విషయంలో కూడా అదే జరిగింది. “ఆఫ్ ది రికార్డు” మాట్లాడిన ఈ హీరో, రీసెంట్ గా వచ్చిన తన రెండు సినిమాలకు సంబంధించి తనదైన విశ్లేషణ అందించాడు.
శర్వానంద్ లెక్క ప్రకారం, సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానంభవతి ఓ మోస్తరుగా, అంటే యావరేజ్ గా ఆడుతుందని అనుకున్నాడట. దానికి కారణం బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉండడమే. కానీ శర్వ అంచనా తప్పింది. శతమానంభవతి సినిమా మంచి కలెక్షన్లు సాధించి, శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక తాజాగా వచ్చిన రాధ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో వర్క్ చేశాడట శర్వానంద్. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని, కాంబినేషన్లు కూడా వర్కవుట్ అయ్యాయని, మ్యూజిక్ బాగా సింక్ అయిందని.. ఇలా రిలీజ్ కు ముందు ఏవేవో చెప్పుకొచ్చాడు.
కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం శర్వ చెప్పిన రేంజ్ లో రాధ లేదు. జస్ట్ యావరేజ్ అనిపించుకుందంతే. ఇలా తన రెండు సినిమాలకు సంబంధించి శర్వానంద్ ఏదైతే అనుకున్నాడో అది రివర్స్ అయింది.