తెలుగు జానాలకు సినిమాలంటే పిచ్చి… బాహుబలి సినిమాతో అది కాస్త పైత్యం లెవెల్ పరాకాష్టకు చేరుకుంది. అది సాధించిన విజయం, తీసుకొచ్చిన ఆదాయంతో సినీ నిర్మాతలు కూడా మన సినిమా మీద కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి సినిమాకు వచ్చిన డబ్బులు చూసి ఆశపుట్టిందో లేక నిజంగానే రాముడి మీద, రామాయణం మీద అంత భక్తి పొంగుకొచ్చిందో గానీ పక్కా కమర్షియల్ నిర్మాత అల్లు అరవింద్ 500 కోట్లతో రామాయణం తీస్తానని ప్రకటించాడు. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో అప్పుడే ఆ రామాయణంలో రాముడు మా రాంచరణే అంటూ ఒక పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. అందులో 500 కోట్ల బడ్జెట్ సినిమా అనే ముద్ర కూడా ఒకటి కొట్టారు సినిమాకు అది కూడా ఒక గొప్పదనం లాగా…సరే ఇంతకూ గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే ఈ భారీ సినిమాలో రాముడు రాంచరణేనా..మరి రాంచరణ్ రాముడైతే సీత ఎవరు…
వాస్తవానికి రామాయణం సినిమాలో క్యాస్టింగ్ గురించి అల్లు అరవింద్ అండ్ కో ఇప్పటికే ఆలోచన ప్రారంభించింది. తొలత టాలీవుడ్ లోని ప్రధాన తారాగణంలో నుంచే రాముణ్ణి, రావణాసుడినీ ఎంచుకోవాలని అనుకున్నా..ఆ పాత్ర గొప్పతనానికి సరితూగే, న్యాయం చేసే ముఖాలు మన ఇండస్ట్రీలో కనబడలేదట.. ఒక వేళ బాలీవుడ్ నుంచి ఎర్రతోలు కుర్రాణ్ణి ఎరర్నైనా పట్టుకొద్దామంటే ఇదిగో మన రాఘవేద్రరావు నమో వెంకటేశాయలో వెంకటేశ్వర స్వామిలాగా తేలిపోతారనే భయం పట్టుకుంది. అందుకే తెలుగులోనే రాముడు, సీత క్యారెక్టర్‌లకు సూటయ్యే, పాత్రలకు న్యాయం చేయగల నటుల కోసం అన్వేషిస్తున్నారట.
అది కూడా పూర్తిగా కొత్త ముఖాలైతేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారు…సో అల్లువారు నిర్వించబోయే రామాయణంలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ కూడా ప్రధాన పాత్రలు పోషించే అవకాశం లేదు. రాంచరణ్ రాముడిగా హల్‌చల్ చేస్తున్న పోస్టర్ కేవలం అభిమానుల క్రియేషన్ మాత్రమే…సరే పాపం మెగా అభిమానులేదో మన హీరోను రాముడిగా చూద్దాం అని సరదా పడ్డారనుకో.. అంతలోనే చూడండి మిగతా హీరో అభిమాన దళాల నుంచి ఎన్నెన్ని కామెంట్లో..రాంచరణ్ రాముడంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడమని ఒకాయన ఫ్యాన్స్..రాంచరణ్ రాముడికంటే హనుమంతుడిగా అయితే బాగా సూట్ అవుతాడని ఇంకొక హీరో అభిమానులు.
సరే ఆ విషయం పక్కన పెడితే సినిమా ప్రొమోషన్‌లో సిద్ధహస్తులైన అల్లు అరవింద్ అండ్ బ్యాచే రాంచరణ్ రాముడి పోస్టర్‌ని తయారు చేసి జనాల్లోకి వదిలిందని ఇండస్ట్రీలో కొందరంటున్న మాట…