మెగా బేస్‌ షేక్‌ అయింది

'బాహుబలి 2' సాధించిన వసూళ్లతో తెలుగు సినిమా మార్కెట్‌ స్వరూపం మారిపోయింది. బాహుబలి చిత్రాలని మినహాయిస్తే ఓవరాల్‌గా వంద కోట్ల షేర్‌ వచ్చిన సినిమా 'ఖైదీ నంబర్‌ 150' తప్ప ఇంకోటి లేదు. అలాంటిది…

'బాహుబలి 2' సాధించిన వసూళ్లతో తెలుగు సినిమా మార్కెట్‌ స్వరూపం మారిపోయింది. బాహుబలి చిత్రాలని మినహాయిస్తే ఓవరాల్‌గా వంద కోట్ల షేర్‌ వచ్చిన సినిమా 'ఖైదీ నంబర్‌ 150' తప్ప ఇంకోటి లేదు. అలాంటిది బాహుబలి 2 కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల కోట్ల షేర్‌ సాధించే దిశగా దూసుకుపోతోంది. తెలుగు సినిమా పరిశ్రమపై దశాబ్ధాల తరబడి సాగిన మెగా ఆధిపత్యానికి 'బాహుబలి' బ్రేక్‌ వేసింది. భారీ స్కేల్‌, విజువల్‌ అప్పీల్‌ వున్న చిత్రాలకి స్టార్స్‌ని మించిన వ్యాల్యూ వుంటుందని, కేవలం ఒక్క భాషకే దాని విజయం పరిమితం కాదని బాహుబలి నిరూపించింది. బాహుబలిలాంటి సినిమాని మరొకరు ఇప్పట్లో తెరకెక్కించడం సాధ్యం కాదు.

రాజమౌళి తప్ప ఈ తరహా చిత్రాలని రూపొందించే సత్తా వుందనిపించిన దర్శకులు ఎవరూ లేరు. బడ్జెట్‌ ఇచ్చినంత మాత్రాన ఇలాంటి సినిమాని తీసి పెడతారనే గ్యారెంటీ లేదు. ఇన్నేళ్ల ఆధిపత్యానికి తెర పడిన నేపథ్యంలో బాహుబలి డామినేషన్‌ని కౌంటర్‌ చేసి తమ సత్తాని తిరిగి చాటుకునే చిత్రాన్ని మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఇస్తుందో, ఎవరితో ఇస్తుందో చూడాలిక.