విక్రమ్ కుమార్ కథలన్నీ కొత్తగా ఉంటాయి. అతడి స్క్రీన్ ప్లేలో ఓ జిమ్మిక్కు కనిపిస్తుంది. అఖిల్ కోసం రాసుకున్న కథ కూడా అలాంటిదే. అటు నాగ్, ఇటు అఖిల్ ఇద్దరికీ నచ్చింది ఈ స్టోరీ. అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత తన సెకెండ్ ప్రాజెక్టుగా ఈ కథకు ఓకే చెప్పాడు అఖిల్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథకు ఉత్తర భారతదేశానికి సంబంధం ఉందట.
కథ ప్రకారం, అఖిల్ నార్త్ ఇండియాలో కొన్నాళ్లు గడుపుతాడు. దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం త్వరలోనే ఉత్తర భారతదేశ యాత్ర చేపట్టనుంది యూనిట్. లక్నో, ఆగ్రా, అలహాబాద్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
అఖిల్ రెండో సినిమాకు “జున్ను” లేదా “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. అలియా భట్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్.