కలర్ స్వాతి రిటర్న్స్

స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో తళక్కున మెరిసింది కలర్ స్వాతి. పక్కింటి అమ్మాయిలా కనిపించే స్వాతి, కృష్ణవంళీ డేంజర్ సినిమాతో స్టార్ట్ చేసి, త్రిపుర వరకు బాగానే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అక్కడితో బ్రేక్…

స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో తళక్కున మెరిసింది కలర్ స్వాతి. పక్కింటి అమ్మాయిలా కనిపించే స్వాతి, కృష్ణవంళీ డేంజర్ సినిమాతో స్టార్ట్ చేసి, త్రిపుర వరకు బాగానే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అక్కడితో బ్రేక్ పడింది. అయితే మంచి హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న స్వాతికి సరిపడా సబ్జెక్ట్ లు దొరక్కనే ఈ సమస్య. ఎందుకంటే ఆమె అన్ని తరహా  హీరోయిన్ పాత్రలకు సెట్ కాదు.

సరే, ఇంతకీ లేటెస్ట్ సంగతేమిటంటే, స్వాతి మళ్లీ తెలుగు తెరపై హీరోయిన్ గా కనిపించబోతోంది. ఓ మాంచి సబ్జెక్ట్ కు ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కొత్త హీరో సరసన ఆమె నటించబోతోంది. మాంచి మిడిల్ క్లాస్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే నిర్మాణం, దర్శకత్వం వంటి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఓ తమిళ సినిమా మూలకథను తీసుకుని, తెలుగులో మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా స్వాతి అభిమానులకు ఇది ఇంట్రెస్టింగ్ న్యూసే.