అలియా భట్.. ఓ అందని ద్రాక్ష

అలియాభట్.. ఈ పేరు టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఓ క్రేజీ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తే చాలు అలియా భట్ పేరు సర్రున తెరపైకొస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమ…

అలియాభట్.. ఈ పేరు టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఓ క్రేజీ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తే చాలు అలియా భట్ పేరు సర్రున తెరపైకొస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ తెలుగు పరిశ్రమ వైపు చూడలేదు. తాజాగా ఈ అమ్మడి పేరు మరోసారి ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బన్నీ-వక్కంతం సినిమాలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

అఖిల్ మొదటి సినిమా కోసం అలియాభట్ ను ట్రై చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది వర్కవుట్ కాలేదు. ఒక దశలో ఎన్టీఆర్, మహేష్ మూవీస్ కోసం కూడా అలియా భట్ ను సంప్రదించారని కథనాలు వచ్చాయి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. 

మన మేకర్స్ లో ఎంతమంది అలియా భట్ ను కలిశారనే విషయాన్ని పక్కనపెడితే, ప్రస్తుతానికి ఆమెకు మాత్రం తెలుగులో నటించే ఆలోచన లేదు. మరీ ముఖ్యంగా క్యారెక్టర్స్ విషయంలో అలియా భట్ చాలా పర్టిక్యులర్ గా ఉండడంతో, మనోళ్లు చెప్పే కథలు-పాత్రలు అలియాకు నచ్చడం లేదు. 

19 ఏళ్ల వయసుకే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కడ మహాముదురు అనిపించుకుంటోంది. తన క్యారెక్టర్ కు ఫుల్ వెయిట్ ఉండే సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. హైవే, 2-స్టేట్స్, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ.. ఈ సినిమాలు చూస్తే అలియాభట్ మూవీ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉందో ఈజీగా గ్రహించొచ్చు. ఇలాంటి హీరోయిన్ దగ్గరకు మనోళ్లు.. 6 పాటలు, 2 ముద్దులు, ఒక బికినీ సీన్ లాంటి స్టోరీలతో వెళ్తే ఒప్పుకుంటుందా చెప్పండి. అందుకే టాలీవుడ్ మేకర్స్ కు అలియా భట్ ఎప్పటికీ అందని ద్రాక్షే.