శ్రీముఖి, టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఏంకర్ గా, గేమ్ షో నిర్వాహకురాలిగా ఫుల్ బిజీ. మరి అలాంటి ఆర్టిస్టును సినిమాలో ఓ కీలకపాత్రం కోసం తీసుకున్నారు బాబు బాగా బిజీ టీమ్ జనాలు. అక్కడే తప్పులో కాలేసినట్లున్నారు. క్రేజ్ వున్న ఏంకర్ కదా, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ తీరాచేస్తే ఏముంది, పోస్టర్ మీద ఫొటో ప్రింట్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది.
ఎక్కడ వాడాలాన్నా ఇప్పుడు శ్రీముఖి స్టిల్ లేదట. అప్పటికీ పబ్లిసిటీ కొసం సినిమాలో మిగిలిన ఇద్దరు అమ్మాయిలతో పాటు, శ్రీముఖి తో కలిసి స్పెషల్ గా ఫొటో షూట్ కూడా ఏర్పాటు చేసారట.దానికి కూడా శ్రీముఖి రాలేదట. అదేంటీ అని శ్రీముఖి ఫాదర్ ను అడిగితే, మమ్మల్నేం చేయమంటారు, కావాలంటే చూసుకోండి అంటూ మే వరకు శ్రీ ముఖి డేట్ షీట్ పంపించారట. ఎక్కడా ఖాళీ లేదట.
దాంతో మిగిలిన హీరోయిన్ల స్టిల్స్ తోనే సరిపెట్టుకోవడం బాబు బాగా బిజీ యూనిట్ జనాల వంతయింది. చిన్నదయినా స్పెషల్ గా వుండే క్యారెక్టర్ దక్కింది శ్రీముఖికి. ఆమెకు ఓకె. కానీ చిన్న సినిమాను మరింతగా ప్రమోట్ చేయడానికి మాత్రం ఆమె స్టిల్స్ వాడుకునే అవకాశం మాత్రం నిర్మాతలకు దక్కలేదు. బాబు బాగా బిజీ అని కాదు శ్రీముఖి బాగా బిజీ కావడంతో.