ఊరించడంలో ఈ హీరో నంబర్ వన్

కమల్ హాసన్ కెరీర్ లో ఉన్నన్ని పెండింగ్ ప్రాజెక్టులు మరే హీరోకు ఉండవేమో. ఏ సినిమా గుర్తు చేసినా కచ్చితంగా వస్తుందంటాడు. ప్రస్తుతం అదే పని మీద ఉన్నామని కూడా చెబుతుంటాడు. కానీ ఏళ్లు…

కమల్ హాసన్ కెరీర్ లో ఉన్నన్ని పెండింగ్ ప్రాజెక్టులు మరే హీరోకు ఉండవేమో. ఏ సినిమా గుర్తు చేసినా కచ్చితంగా వస్తుందంటాడు. ప్రస్తుతం అదే పని మీద ఉన్నామని కూడా చెబుతుంటాడు. కానీ ఏళ్లు గడిచిపోతూనే ఉంటాయి. కమల్ పెండింగ్ ప్రాజెక్టులు మాత్రం తెరపైకి రావు. తాజాగా ఈ లిస్ట్ లోకి విశ్వరూపం-2 కూడా చేరింది. 

విశ్వరూపం సినిమా విడుదలై 4 ఏళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఈ సినిమాకు సీక్వెల్ రాలేదు. నిజానికి విశ్వరూపం సినిమా షూటింగ్ టైమ్ లోనే పార్ట్-2కు సంబంధించి కూడా 40శాతం షూటింగ్ కంప్లీట్ చేశామని ప్రకటించాడు కమల్. అయితే మిగతా 60శాతం షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందట. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ వర్క్ పూర్తిచేసి ఈ ఏడాదిలోనే విశ్వరూపం-2ను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు లోకనాయకుడు.

ప్రస్తుతం కమల్ చేస్తున్న శభాష్ నాయుడు సినిమా కూడా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో ఎవరికీ తెలీదు. వీటితో పాటు గతంలో కమల్ ప్రకటించి, శంకుస్థాపన చేసిన మురుదనాయగమ్ సినిమా ఉండనే ఉంది. దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.

కమల్ సినిమాలు డిలే అవ్వడానికి కారణం క్లియర్. ఈ హీరో రాసుకున్న కథలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. పైగా వాటికి నిర్మాత కూడా ఇతడే. అందుకే ఆర్థిక కారణాల వల్ల కమల్ సినిమాలన్నీ లేట్ అవుతుంటాయి. అయితే విశ్వరూపం-2 సినిమాకు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదని చెబుతున్నాడు ఈ విలక్షణ నటుడు.