స్టార్ స్టేటస్ ఒక్కసారి వస్తే చాలు. డబ్బు ఆటోమేటిగ్గా అదే వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. డబ్బు ఎలా సంపాదించాలో సల్మాన్ ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా. సినిమాలకు రెమ్యూనరేషన్ రూపంలో కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్న సల్మాన్… సేమ్ టైం శాటిలైట్ రైట్స్, యాడ్స్ రూపంలో వేల కోట్లు సంపాదిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో రకంగా కూడా సల్మాన్ తన బిజినెస్ ను విస్తరించాడు. తన ట్విట్టర్ ఎకౌంట్ ను కూడా మనీ మెషీన్ గా మార్చేశాడు.
తాజాగా ఓ కళ్లజోడు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు సల్మాన్. ఆ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనలో కూడా నటించాడు. భారీగానే ఎమౌంట్ తీసుకున్నాడు. అయితే ఆ యాడ్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడానికి ఏకంగా 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.
నిజానికి ట్విట్టర్ లో పోస్టులు, వీడియోలు పెట్టి డబ్బు తీసుకోవడం సల్మాన్ కు కొత్తేంకాదు. గతంలో కూడా ఇలాంటి పనులు చాలానే చేశాడు. అయితే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా సల్మాన్ ఆర్జించిన అత్యథిక మొత్తం ఇదే. ఈ హీరోకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సో.. సల్మాన్ ఓ పోస్ట్ పెట్టాడంటే అది నేరుగా అందరికీ వెళ్లిపోతుంది. విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. అందుకే కార్పొరేట్లు కూడా సల్మాన్ అడిగినంత ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.